మద్యపానం పై సంచలన ప్రకటన చేసిన యూఏఈ

- November 09, 2020 , by Maagulf
మద్యపానం పై సంచలన ప్రకటన చేసిన యూఏఈ

యూఏఈ: మద్యపానం ప్రభావితం చేస్తూ చట్టంలో అతిపెద్ద సవరణను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం..అదే, లైసెన్స్ లేకుండా మద్యం సేవించడం.!

అయితే, నివాసితులు మరియు పర్యాటకులు ఏమి గమనించాలి?
* మద్యపానం ఇకపై యూఏఈ లో క్రిమినల్ నేరం కాదు.
* అధికారిక ప్రాంతాల్లో మద్యం తాగేవారి మినహా, ఇకపై, ఆల్కహాల్ లైసెన్స్ లేకపోయినా/అనధికారంగా మద్యం విక్రయించే ఎవరైనా న్యాయ విచారణను ఎదుర్కోరు.

ఇప్పటికీ అమలు చేయబడే నియమాలు..
* మద్యం, ప్రైవేటుగా లేదా లైసెన్స్ పొందిన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే సేవించాలి.
* చట్టబద్ధంగా, మద్యం సేవించే వ్యక్తి కనీస వయసు 21 ఉండాలి.
* శిక్షాస్మృతి యొక్క 1987 ఫెడరల్ లా నెంబర్ 3 కు చేసిన సవరణల ప్రకారం, 21 లోపు వయస్సు గలవారికి మద్యం అమ్మిన ఎవరైనా శిక్షార్హులు. ప్రతి ఎమిరేట్‌కు ఈ చట్టాన్ని జారీ చేసే హక్కును ఇవ్వడం జరిగింది.

ఏ ఎమిరేట్ ఎలా వ్యవహరిస్తోంది?
* అబుధాబి: 2018 నుండి అబుదాబిలో మద్యంపై ఆంక్షలు క్రమంగా నవీకరించబడ్డాయి. లైసెన్స్ ఉంటేనే మద్యం సేవించేందుకు ప్రజలకు అనుమతి కల్పించింది. అలాగే, అనేక ఇస్లామిక్ సెలవులకు ముందు రోజు మద్యం అమ్మకం నిషేధించబడింది, వాటిలో వక్ఫత్ అరాఫా, అల్ ఇస్రా మరియు M’raj, ప్రవక్త మొహమ్మద్ మరియు ఇస్లామిక్ న్యూ ఇయర్ ఉన్నాయి. అయితే, నూతన చట్ట సవరణ ను అనుసరించి లైసెన్స్ లేకపోయినా మద్యం అమ్మవచ్చు మరియు సేవించవచ్చని తెలిపింది. కానీ, కస్టమర్ల వయసు 21 ఉండాలి అనే కనీస వయో పరిమితి ప్రకటించింది. ప్రజలు కొనుగోలు చేసిన మద్యాన్ని మరలా అమ్మటానికి వీలులేదు అలాగే కొనుగోలు చేసిన మద్యాన్ని వారి గృహంలో కానీ లేదా అధికారిక ప్రాంతాల్లో మాత్రమే సేవించాలి.
* దుబాయ్: గతంలో మద్యం విక్రయించే ముందు నివాసితులు తమ లైసెన్స్, పర్యాటకులు తమ తాత్కాలిక లైసెన్స్ ను తప్పక చూపించాల్సి ఉండేది. అయితే, సవరించిన చట్టప్రకారం బార్‌లు మరియు రెస్టారెంట్లు లైసెన్స్‌లను చూడమని అడగవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com