ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రా జెనెకా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం
- November 09, 2020
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తికగా ఎదురుచేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్రారంభం కావడం నిజంగా శుభవార్తే. ఈ వ్యాక్సిన్ ను ఆస్ట్రేలియాలో ఇవాళ్టి నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఎల్ లిమిటెడ్ తో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా 30 మిలియన్ డోసుల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2021 మార్చి నాటికి ఈ వ్యాక్సిన్ ఆస్ట్రేలియా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. దేశ జనాభాలో అత్యధికులకు వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు. దీనిపై ఆస్ట్రేలియా మీడియా సంస్థ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ స్పందిస్తూ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియకు 50 రోజుల సమయం పట్టనుందని వెల్లడించింది. కాగా, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!