కొత్త ఫ్లోటస్ 'జిల్ బైడెన్'

- November 09, 2020 , by Maagulf
కొత్త ఫ్లోటస్ \'జిల్ బైడెన్\'

జిల్ బైడెన్.. నార్త్‌లోని అమెరికా వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ సతీమణి అమెరికా ఫస్ట్ లేడీ. జో బైడెన్‌లాగే జిల్ కూడా సమ్‌థింగ్ స్పెషల్. ఇప్పటికీ బోధనా వృత్తినే నమ్ముకున్నారు. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో రీ సౌండ్ వస్తోంది.

అమెరికా అధ్యక్షుడికి ఎంత ప్రత్యేక స్థానం ఉంటుందో.. ఫస్ట్ లేడీకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ట్రంప్ పాలనలో మెలీనియా పాత్ర కూడా అంతే. కానీ ఇప్పుడు ట్రంప్ పని అయిపోయింది. కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నారు. కొత్త ఫ్లోటస్ కూడా. బైడెన్ సతీమణి జిల్. ఈమె చాలా ప్రత్యేకం. ఇటాలియన్ మూలాలు ఉన్న జిల్ అమెరికాలో స్థిర పడ్డారు. ఫిలెడిల్ఫియాలో 1951లో పుట్టి పెరిగిన జిల్ డాక్టరేట్ చేశారు. ఉపాధ్యాయురాలుగా కూడా పని చేశారు. టీచింగ్ అంటే ఆమెకు ప్రాణం. మొదట్లో 13 ఏళ్లు పలు స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్‌గా వర్క్ చేశారు. తర్వాత కొన్ని కాలేజీల్లో కూడా లెక్చరర్‌గా పని చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com