అయోధ్య లో దీపావళి శోభ

- November 09, 2020 , by Maagulf
అయోధ్య లో దీపావళి శోభ

అయోధ్య లో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్‌ 11 నుంచి 13 మధ్య జరిగే ఈ దీపాల పండుగలో ఈసారి 5.51 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రామజన్మభూమి- అయోధ్య వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ(ఆగష్టు 5) తర్వాత జరగనున్న అయోధ్యలో మొదటి వేడుక కానుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. 

ఈ నేపథ్యంలో ఈసారి మరింత ప్రత్యేకంగా దీపోత్సవాన్ని నిర్వహించేందుకు యోగి సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలతో శ్రీరామ జన్మభూమితో పాటు కనక భవన్‌, రామ్‌ పైడి, హనుమాన్‌ ఘర్‌ ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ శుభ సందర్భంలో, మొట్ట మొదటి సారిగా ఆవుపేడతో చేసిన దీపాలను ఈ వేడుకలో వాడుతున్నారు. యూపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలకు 20 జానపద నృత్య బృందాలను ఆహ్వానించింది. ఇక సీఎం యోగికి అయోధ్యతో మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com