45 కిలోల డ్రగ్స్ అమ్మకం: ముగ్గురి అరెస్ట్
- November 10, 2020
యూఏఈ: 45 కిలోల హెరాయిన్, క్రిస్టల్ మెత్‌ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. వారి వారి నుంచి మాదక ద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఈ వివరాల్ని వెల్లడించారు. ముఠా సభ్యులు అబుధాబి, దుబాయ్ మరియు షార్జాల్లో మాదక ద్రవ్యాల్ని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ సుహైల్ అల్ రాష్ది మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అబుధాబి పోలీస్ - యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్, ఈ తరహా కేసుల్ని డీల్ చేస్తోందని చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘారిబ్ అల్ దహెరి మాట్లాడుతూ, క్రిమినల్ గ్యాంగుల్నీ, ఇల్లీగల్ డ్రగ్స్ విక్రయదారుల్నీ పట్టుకోవడంలో పోలీసులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







