బ్యాటరీ మార్చుతుండగా బోటులో అగ్ని ప్రమాదం
- November 10, 2020
రస్ అల్ ఖైమా: ఇద్దరు భారతీయ ఫిషర్‌మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన రస్ అల్ ఖైమాలోని గలెలియా పోర్ట్ వద్ద జరిగింది. ఫిషింగ్ బోటులో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో వున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఫిషర్‌మెన్‌కి ఓ మోస్తరు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మెహబూబి మాట్లాడుతూ, గాయాలతో ఆసుపత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని అన్నారు. రస్ అల్ ఖైమా ఫిషర్‌మెన్ అసోసియేషన్ హెడ్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, బ్యాటరీని మార్చే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారని, ఈ మేరకు అసోసియేషన్‌కి సమాచారం ఇచ్చారని తెలిపారు. రెగ్యులర్ మెయిన్‌టెనెన్స్‌తో ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







