కోవిడ్ వ్యాక్సిన్ కోసం అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ తో కువైట్ ఒప్పందం
- November 10, 2020
కువైట్ సిటీ:కువైట్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను యుద్ధప్రాతిపదికన అందించేందుకు తాము ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తో ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఫైజర్..జర్మన్ బయోటెక్ కంపెనీ బయోన్టెక్ తో కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశలో ఉంది. అయితే...తమ మూడో దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని, 90 శాతానికిపైగా ప్రభావంతంగా ఫలితాలు చూపిస్తున్నాయని..ఫైజర్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు..వ్యాక్సిన్ పనితీరుపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీతో చేయించిన మధ్యంతర విశ్లేషణ నివేదికకు సంబంధించి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం కూడా పంపింది. అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ కు అధికారిక అనుమతి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రాగానే కువైట్ కు కూడా ప్రధాన్యత ఇస్తూ పది లక్షల డోసులు అందించాలని ప్రభుత్వం ఫైజర్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 7.6 బిలియన్ దినార్లని స్పష్టం చేసింది. తాము కువైటీయన్ల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, దేశంలోని ప్రజలకు సెగ్మెంట్లుగా విభజించి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించింది. ఒకవేళ వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలోనే దిగుమతి అయితే..ముందుగా వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, ఆస్పత్రి సిబ్బందితో పాటు ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి ప్రధాన్యత క్రమంలో వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ సరిపడినంతగా దిగుమతి అయితే...దేశంలోని పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







