బహ్రెయిన్:కస్టమర్లకు క్యారిఫోర్ ప్రమోషన్ ఆఫర్స్..నెల మొత్తం డిస్కౌంట్లు
- November 10, 2020
మనామా:బహ్రెయిన్ లోని రిటైల్ మార్కెట్ దిగ్గజం క్యారిఫోర్ నెల మొత్తం వినియోగదారులకు ప్రమోషనల్ ఆఫర్స్ అందిస్తోంది. మజిద్ అల్ ఫత్తైమ్ ఆధ్వర్యంలో నిర్వహించే
క్యారిఫోర్ స్టోర్స్ క్యారెఫోర్ ఫ్రైడే పేరుతో పలు వస్తువులపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. ఈ నెల రోజులలో షాపింగ్ చేసే వినియోగదారులు పలు విలువైన బ్రాండ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు పొందవచ్చని నిర్వాహకులు వివరించారు. స్టోర్స్ పలు వస్తువలపై బ్రాండ్లపై మైక్లబ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవటం ద్వారా కూడా డిస్కౌంట్లు పొందవచ్చని వెల్లడించారు.. పండ్లు, కూరగాయలతో పాటు ఎంపిక చేసిన వస్తువులు, బ్రాండెడ్ దుస్తులపై 75 శాతం డిస్కౌంట్ ధరలోనే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఇక కిరాణ సమాన్లు, తాజా తినుబండారాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్యాూటీ, హెల్త్ ప్రాడక్ట్స్ కు సంబంధించి సూపర్ సేల్స్ ఆఫర్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కింగ్డమ్ లోని 13 క్యారెఫోర్ స్టోర్స్ లో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయని, క్యారిఫోర్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేయవచ్చని నిర్వహాకులు వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు