సౌదీ అరేబియా : డాక్టర్ పై కాల్పులు...సౌదీ వ్యక్తి అరెస్ట్

- November 12, 2020 , by Maagulf
సౌదీ అరేబియా : డాక్టర్ పై కాల్పులు...సౌదీ వ్యక్తి అరెస్ట్

రియాద్:నార్తర్న్ సౌదీ అరేబియాలో ఓ వ్యక్తి డాక్టర్ పై కాల్పులకు తెగబడ్డాడు. అల్ జౌఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాభై ఏళ్ల సౌదీ వ్యక్తి..ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ ఏరియాలో డాక్టర్ పై దాడికి దిగాడు. వెంట తెచ్చుకున్న గన్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన డాక్టర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డాక్టర్ పై కాల్పుల ఘటనను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ..వైద్యులపై ఎలాంటి దాడులను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. వైద్యులపై దాడి చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com