ఫ్రీ కూపన్లు అంటూ తప్పుడు ప్రచారం..కూపన్ల ప్రచారాన్ని కొట్టిపారేసిన లులు
- November 12, 2020
యూఏఈ:యూఏఈలోని ప్రముఖ రిటైల్ మార్కెట్... లులు గ్రూప్ ప్రజలకు 250 యూరో డాలర్ల ఉచిత కూపన్లు అందిస్తోన్న ప్రచారాన్ని చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ వి.నందకుమార్ కొట్టిపారేశారు. తాము ఎలాంటి కూపన్ ఆఫర్లు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వే పేరుతో కొందరు నకిలీగాళ్లు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. సర్వే పేరుతో వినియోగదారుల అభిప్రయాలను తెలుసుకున్న తర్వాత..నెక్ట్స్ టార్గెట్ గా వాట్సాప్ లో ఐదు గ్రూపులకు గానీ, 20 మంది స్నేహితులకు లులు హైపర్ మార్కెట్ రిఫర్ చేయాలని షరతు విధిస్తారు. మెసేజ్ చేయగానే 250 యూరో డాలర్ల కూపన్ అందుతుందని, దాంతో హైపర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చని, ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేసే అప్షన్ ఉందని మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే..తాము ఎవరికీ ఎలాంటి కూపన్లను ఆఫర్ చేయటం లేదని లులు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







