కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలే
- November 13, 2020
కువైట్ సిటీ:కువైట్ హెల్త్ అథారిటీస్, విద్యార్థుల పరీక్షల విషయమై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిక్వెస్త్ని తిరస్కరించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ప్రత్యక్ష విధానంలో కష్టమని హెల్త్ అథారిటీస్ వెల్లడించాయి. విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పరీక్షల్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించడమే మేలని సూచించింది. హెల్త్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫైజర్ అలాగే బయో టెక్నాలజీ సంస్థ బయో ఎన్ టెక్ - కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందంటూ ప్రకటన చేసిన దరిమిలా, కువైట్ మినిస్ట్రీ 1 మిలియన్ డోసులను ఆర్డర్ చేయడం జరిగింది. కాగా, కువైట్లో ఇప్పటిదాకా 134,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 830 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష