విదేశాల నుంచి భారత దేశానికి వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గదర్సకాలు

- November 13, 2020 , by Maagulf
విదేశాల నుంచి భారత దేశానికి వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గదర్సకాలు

కోవిడ్-19 అన్‌లాక్ 5.0 భాగంగా విదేశాల నుంచి భారత దేశానికి వెళ్లే ప్రయాణీకులకు భారత  కేంద్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.  
 
ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1) విమానం ఎక్కేందుకు కనీసం 72 గంటల ముందు తప్పనిసరిగా http://www.newdelhiairport.in ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

2) విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా 14 రోజులు హోంక్వారంటైన్/ స్వీయ పర్యవేక్షణలో ఉండేందుకు అంగీకరిస్తూ సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పోర్టల్ లో సమర్పించాల్సి ఉంటుంది.  

3) తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి, గర్భిణులకు, పదేళ్లలోపు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్తున్న ప్రయాణికులు 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

4) పైన చెప్పిన విధంగా మినహాయిపులు కోరేవారు విమానం ఎక్కే 72 గంటల ముందు http://www.newdelhiairport.in ఆన్ లైన్ లో పోర్టల్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇచ్చే సమాచారమే తుది నిర్ణయం అవుతుంది. 

5) అంతే కాకుండా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు కోవిడ్ నెగెటివ్‌ ఉన్నట్లు చెప్పుకొనే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు (RT-PCR test) చేయించుకున్న రిపోర్టును జత చేయాలి.  ఈ టెస్ట్ విమానం ఎక్కడానికి 72 గంటల ముందే చేయించుకొని ఉండాలి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

6) ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులు తప్పనిసరిగా క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందాలంటే విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి. (అటువంటి నిబంధనలు ఉన్నచోట)

7) పేరా (v) & (vi) లను స్వీయ నిర్బంధం నుంచి కూడా మినహాయింపులు కావాలంటే ఆయా ప్రయాణీకులందరూ తమ ఆరోగ్యంపై స్వయంగా పర్యవేక్షణకు అంగీకరించాలి.

8) ఆర్టీ-పిసిఆర్ నెగటివ్ సర్టిఫికేట్ లేకుండా వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు విమానాశ్రయంలో ఆర్టి పిసిఆర్ పరీక్షా సౌకర్యం ఉన్నప్పటికీ అక్కడ పరీక్షించుకునేందుకు సిద్ధంగా లేకపోతే సదరు ప్రయాణీకుడు తప్పనిసరిగా 7 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లేదా 7 రోజుల ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది.

విమానం ఎక్కే ముందు:

1) విమానాల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలు తెలిసేలా సంబంధిత ట్రావెలింగ్ ఏజెన్సీలు లేదా సంస్థలు టికెట్ వెనుక ముంద్రించాలి. 

2) ప్రయాణాలు చేసే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి

3) ప్రయాణాలకు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కోవిడ్ లక్షణాలు లేని వారిని మాత్రమే విమానంలోకి అనుమతిస్తారు.

4) విమానాశ్రయాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ / క్రిమీసంహారక ద్రావణంతో శుభ్రంచేయాలి. 

5) ఎయిర్‌పోర్ట్‌లలో తప్పని సరిగా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు     తీసుకోవాలి. 

విమానంలో ప్రయాణించే సమయంలో:

1) ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వని ప్రయాణీకులు విమానంలో డూప్లికేట్ ఫారమ్ ను నింపాలి. ఆ ఫారమ్ ఎయిర్ పోర్టులోని ఆరోగ్యశాఖ మరియు ఇమ్మిగ్రేషన్ ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుంది. 

2) కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇతర విధి విధానాలను ఎయిర్ పోర్టులలో తప్పకుండా అనౌన్స్ మెంట్ రూపంలో ప్రచారం చేయాలి.
 
3) బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎయిర్ పోర్టు సిబ్బంది చర్యలు తీసుకోవాలి

విమానం దిగిన తర్వాత:

1) విమానం నుంచి దిగే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

2) బయటకు వెళ్లే ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ చేసే దగ్గర ఎయిర్ పోర్ట అధికారులకు ఆన్ లైన్ పోర్టల్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన ఫామ్ ను చూపించాలి. 

3) స్క్రీనింగ్ సమయంలో ఏ ప్రయాణికైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే సదరు వ్యక్తిని వెంటనే ఐసోలేట్ చేయడం లేదా మెడికల్ ప్రొటోకాల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. 

4) థర్మల్ స్క్రీనింగ్ కి ముందు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరుకున్నవారు (ఆన్ లైన్ లో వారి అభ్యర్థనను అంగీకరించినట్టు ముందుగానే చూపించే) అందుకు సంబంధించిన రుజువులను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కౌంటర్ల దగ్గర చూపించి 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు వెళ్లాలి. 

5) థర్మల్ స్క్రీనింగ్ కు ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్టుతో వచ్చినవారు క్వారంటైన్ నుంచి మిహాయింపు పొందుతారు. ఇదే రిపోర్టును ప్రయాణీకులు సంబంధిత రాష్ట్రాల కౌంటర్ల దగ్గర చూపించాలి. అంతేకాకుండా వారంతా 14రోజులు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి. 

6) ఒకవేళ ప్రయాణీకులు ఇంట్లో ఉండగా ఏమైనా కోవిడ్ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడానికి ప్రయాణీకులందరూ జాతీయ, రాష్ట్రస్థాయి అధికారులు, సంబంధిత రాష్ట్రాల కాల్ సెంటర్ల నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. 

7) మిగిలిన ప్రయాణీకులు ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్ కు వెళ్లేందుకు అవసరమైన సదుపాయాలను రాష్ట్రాలు/ కేంద్రపాలితప్రాంతాల్లో కనీసం 7రోజుల క్వారంటైన్లో ఉండేందుకు ఏర్పాట్లు చేయాలి. 
8) ఈ ప్రయాణీకులు కనీసం 7రోజులపాటు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి. 

  • ఐసిఎంఆర్ ప్రొటోకాల్స్ ప్రకారం వారికి పరీక్ష చేస్తారు. 
  •  ఒకవేళ అసింప్టోమాటిక్ / ప్రీ-సింప్టోమాటిక్ / చాలా తేలికపాటి కేసులుగా గుర్తిస్తే వారిని కోవిడ్     కేర్ సెంటర్‌లో (పబ్లిక్ & ప్రైవేట్ రెండూ) ఐసోలేషన్ లో ఉంచాలి.
  •  తేలికపాటి / మితమైన / తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఎంపిక చేసిన కోవిడ్‌ ఆస్పత్రుల్లో చేర్చి    తదనుగుణంగా చికిత్స అందించాలి. 
  •  ఒకవేళ నెగిటివ్ రిపోర్టు వస్తే మరో 7 రోజులపాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండేందుకు     అవసరమైన సూచనలు చేస్తారు.

అంతర్జాతీయ ప్రయాణీకులు ఓడరేవులు / ల్యాండ్ పోర్టులకు వచ్చినపుడు

1) ఓడరేవులు / ల్యాండ్ పోర్టుల ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు కూడా పైన చెప్పబడిన ప్రొటోకాల్సను పాటించాల్సి ఉంటుంది. అయితే క్వారంటైన్ మినహాయింపు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం అందుబాటులో లేదు.

2) తప్పనిసరిగా మినహాయింపు కోరే ప్రయాణీకులు ఓడరేవులు / ల్యాండ్ పోర్టులలో సంబంధిత అధికారులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.

గమనిక: క్వారంటైన్ మరియు ఐసోలేషన్ విషయంలో పైన సూచించిన మార్గదర్శకాలతోపాటు సంబంధిత రాష్ట్రాలే మరికొన్ని సొంత ప్రొటోకాల్స్ ను సిద్ధం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com