దివాళి సెలబ్రేషన్స్ - కోవిడ్19 సేఫ్టీ గైడ్‌లైన్స్
- November 13, 2020
దుబాయ్:కరోనా నేపథ్యంలో దివాళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ అథారిటీస్ సూచిస్తున్నాయి. రిటెయిల్ ఆర్గనైజేషన్, రిటెయిల్ మరియు స్ట్రాటిజిక్ అలయన్సెస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్‌మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫెరాస్ అరాకత్ మాట్లాడుతూ, దుబాయ్‌లో వివిధ మతాలు, జాతులకు చెందిన సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయనీ, అయితే దీపావళి సందర్భంగా ఈసారి కోవిడ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. షాపింగ్ సహా ఆయా ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, మాస్క్‌లు ప్రతి ఒక్కరూ ధరించాలనీ, శానిటైజేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.దివాళి సందర్భంగా ప్రత్యేక రిటెయిల్ డీల్స్ వుంటాయనీ, ఈసారీ అవి కొనసాగుతాయనీ, సంబరాలు ఎలాంటి సమస్యలకూ దారి తీయకుండా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారాయన.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







