గ్రాండ్‌ మాస్క్‌ని ప్రతి రోజూ శుభ్రం చేస్తున్న 4,000 మంది కార్మికులు

- November 13, 2020 , by Maagulf
గ్రాండ్‌ మాస్క్‌ని ప్రతి రోజూ శుభ్రం చేస్తున్న 4,000 మంది కార్మికులు

సౌదీ: పవిత్ర మక్కా నగరంలోని గ్రాండ్‌ మాస్క్‌ని 4,000 మంది కార్మికులు అను నిత్యం శుభ్రం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 100 క్లీనింగ్‌ పరికరాలు, 4,000 మంది వర్కర్స్‌ మాస్క్‌లోని అన్ని ప్రాంతాల్నీ అను నిత్యం శుభ్రం చేస్తున్నట్లు రెండు హోలీ మాస్క్‌లకు సంబంధించిన జనరల్‌ ప్రెసిడెన్సీ పేర్కొంది. కాబా చుట్టూ వున్న ప్రాంతాన్ని శుభ్రం చేసి, స్టెరిలైజ్‌ చేయడానికి 30 నిమిషాలు పడుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అక్టోబర్‌ 4న సౌదీ అరేబియా, ఉమ్రా ప్రార్థనల్ని పునరుద్ధరించిన విషయం విదితమే. తొలుత 6,000 మంది ఉమ్రా యాత్రీకుల్ని రోజువారీ అనుమతించారు. రెండో ఫేజ్‌లో అక్టోబర్‌ 18 నుంచి రోజువారీగా 40,000 మంది వర్షిపర్స్‌ని, 10,000 మంది యాత్రీకుల్ని అనుమతిస్తున్నారు. ఆ మూడో ఫేజ్‌లో 20,000 మంది ఉమ్రా యాత్రీకులు, 60,000 మంది వర్షిపర్స్‌కి అనుమతిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com