అరవై ఏళ్లు దాటిన ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లాల్సిందే..కువైట్ కొత్త పాలసీ
- November 15, 2020
కువైట్ సిటీ:60 ఏళ్లు అంతకుమించి వయసున్న ప్రవాసీ కార్మికులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల వయసు పైబడి.. హైస్కూల్ సర్టిఫికెట్ తో కువైట్ లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రవాసీయులకు ఇకపై రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేయబోయేది లేదని కువైట్ మానవ వనరుల ప్రజా అధికార విభాగం ప్రకటించింది. దీనికి సంబంధించి పరిపాలన పరమైన నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. హై స్కూల్ సర్టిఫికెట్ బేస్ తో కువైట్ లో పని చేస్తున్న ప్రవాసీయులు(60 ఏళ్లకుపైబడినవాళ్లు)..జనవరి 1లోగా ఇక దేశం విడిచి వెళ్లిపోవటం ఉత్తమమని సూచించింది. నూతన పరిపాలన విధానం అమల్లోకి వచ్చే జనవరి 1 నాటికి దేశంలోని వృద్ధ ప్రవాసీయుల నివాస అనుమతులు ఆటోమెటిగ్గా రద్దు అవుతాయని, అప్పటికే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి మళ్లీ రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు