పార్ట్ టైం ఉద్యోగ నిబంధనలను సవరించిన యూఏఈ

- November 15, 2020 , by Maagulf
పార్ట్ టైం ఉద్యోగ నిబంధనలను సవరించిన యూఏఈ

యూఏఈ:దశాబ్దాలుగా ప్రవాస కార్మిక శక్తిపైనే ఉత్పాదక శక్తిని పెంచుకుంటూ వస్తున్న గల్ఫ్ దేశాలు..ఇప్పుడు సొంతంగా కార్మిక శక్తిని పెంపొందించుకునే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యూఏఈ కూడా అందుకు అనుగుణంగా మరో నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతిభావంతమైన కార్మిక శక్తిని పెంపొందించుకునేందుకు పార్ట్ టైం ఉద్యోగ నిబంధనల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇక నుంచి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాలనుకునే వారు తమ యజమానుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో కార్మికుల ప్రధాన కంపెనీ తమ కార్మికులను పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా నిలువరించేందుకు అస్కారం ఉండదు. సదరు కార్మికుడి విశ్రాంతి సమయంలో ఇతర కంపెనీల్లోనూ నిరంభ్యంతరంగా విధులు నిర్వహించుకోవచ్చు. పార్ట్ టైం విధానంలో ఈ మార్పుల ద్వారా దేశంలో కార్మిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని యూఏఈ మానవ వనరుల మంత్రిత్వశాఖ భావిస్తోంది. అయితే...ఇందులో ఉన్న ట్విస్ట్ ఏటంటే...యూఏఈ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రవాస కార్మికుల కంటే ఎమిరాతిలే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవటం కంటే..ఎమిరైజేషన్ లో భాగంగా దేశీయంగా ప్రతిభావంతులైన వారికి ఉపాధి అవకాశాలను పెంచటమే నిబంధనల్లో సవరణల లక్ష్యంగా కనిపిస్తోంది. 2018లోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా..ఇప్పుడు అనుమతుల విషయంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించటం గమనార్హం. దీంతో స్వదేశీ గ్రాడ్యూయేట్లను మరింత సమర్ధవంతంగా ఏకకాలంలో పలు కంపెనీలు వినియోగించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com