హెర్బల్ టీ.. రోజూ ఓ కప్పు తీసుకుంటే..
- November 15, 2020
టీ ప్రపంచంలోని ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా నిరూపించబడింది. సరైన పదార్థాలు, సరైన మేళవింపుతో తయారైన హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా పొందవచ్చు. జీవనశైలిలో కొద్దిగా మార్పు కోరుకుంటే రోజూ ఒక కప్పు హెర్బల్ టీ తాగండి. దాంతో మీ శరీరంలో వచ్చిన తేడాను గమనించవచ్చు. ఈ రోజుల్లో పట్టణ ప్రజల జీవనశైలిని బట్టి, హెర్బల్ టీ మానవాళికి ఒక వరం. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి పని చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 100 శాతం సహజమైన హెర్బల్ టీ వృద్ధాప్య ఛాయలను త్వరగా దరి చేరనివ్వదు.
భోజనం తర్వాత ఒక కప్పు హెర్బల్ టీ తీసుకుంటే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. హెర్బల్ టీలో స్పియర్మింట్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గించి, అతిగా తినే కోరికను నియంత్రిస్తుంది. ఆర్థరైటిస్, తలనొప్పి వంటి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది హెర్బల్ టీ. క్రమం తప్పకుండా వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కునేవారికి హెర్బల్ టీ అద్భుతంగా పని చేస్తుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ రెండు గ్లాసుల హెర్బల్ టీ తాగాలి. నిరాశతో బాధపడేవారికి తేలికపాటి యాంటిడిప్రెసెంట్గా కూడా హెర్బల్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు