ఐపీఎల్‌ 13వ సీజన్‌ సక్సెస్..‌

- November 15, 2020 , by Maagulf
ఐపీఎల్‌ 13వ సీజన్‌ సక్సెస్..‌

యూఏఈ:కరోనా అడ్డంకులను దాటుకుని IPL‌ 13వ సీజన్‌ సక్సెస్‌ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన IPL‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి BCCI భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్‌-మే నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన IPL‌ 13 వ సీజన్‌ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్‌-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది IPL‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. 

అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన BCCI అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్‌కు వేదికైన యూఏఈ.. IPL 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. BCCI, IPL‌ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు IPL‌ తాజా సీజన్‌ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌ కూడా యూఏఈలో నిర్వహించాలని BCCI యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com