ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్..
- November 15, 2020
యూఏఈ:కరోనా అడ్డంకులను దాటుకుని IPL 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన IPL 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి BCCI భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్-మే నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన IPL 13 వ సీజన్ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది IPLను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు.
అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన BCCI అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్‌కు వేదికైన యూఏఈ.. IPL 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. BCCI, IPL సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు IPL తాజా సీజన్ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కూడా యూఏఈలో నిర్వహించాలని BCCI యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







