ఉన్నత విద్యావంతులకు, వృత్తి నిపుణులకు పదేళ్ల రెసిడెన్సీ వీసాలు-యూఏఈ
- November 16, 2020
యూఏఈ:లేబర్ మార్కెట్ లో స్వదేశీయులకు ప్రధాన్యత ఇస్తున్న యూఏఈ...టెక్నాలజీ పరంగా మాత్రం ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది. వృత్తి నిపుణులకు ప్రధాన్యత ఇస్తూ పదేళ్ల గోల్డెన్ రెసిడెన్సీ వీసాలను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఉన్నత విద్యావంతులకు కూడా పదేళ్ల రెసిడెన్సీ వీసాలను ఇచ్చేందుకు యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ అనుమతి ఇచ్చారు. డాక్టర్లు, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు గోల్డెన్ రెసిడెన్సీ వీసాలు ఇవ్వనున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ రంగంలో నిపుణులను కూడా యూఏఈ స్వాగతిస్తోంది. ఏఐలో డిగ్రీ చేసిన వారికి పదేళ్ల రెసిడెన్సీ వీసా ఇస్తామని తెలిపింది. ఇక పీహెచ్డీ చేసిన యువత, అధికారిక అనుమతి ఉన్న ఏదైనా యూనివర్సిటీలో 3.8 కు మించి స్కోరింగ్ చేసిన విద్యార్ధులకు కూడా గోల్డెన్ రెసిడెన్సీ పొందవచ్చు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









