రెండోసారి క్వారంటైన్‌లో బ్రిటన్ ప్రధాని
- November 16, 2020
లండన్: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రధానిని కలిసిన చట్టసభ్యుల బృందంలోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కరోనా రోగిని ప్రధాని కలిసిన నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బోరిస్ ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి బారినపడి వైద్యుల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న బోరిస్ మళ్లీ బాధ్యతల్లో తలమునకలయ్యారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం