ఇల్లు అద్దెకు తీసుకొని గ్యాబ్లింగ్ నిర్వాకం..షార్జా పోలీస్ తనిఖీల్లో పట్టుబడిన ముఠా

- November 17, 2020 , by Maagulf
ఇల్లు అద్దెకు తీసుకొని గ్యాబ్లింగ్ నిర్వాకం..షార్జా పోలీస్ తనిఖీల్లో పట్టుబడిన ముఠా

యూఏఈ: షార్జాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా...కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు పోలీసులు. అయితే..ఈ తనిఖీల్లో ఓ గ్యాబ్లింగ్ ముఠా బాగోతం బయటపడింది. నివాస ప్రాంతాల్లోనూ నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంతో..పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాంబ్లింగ్ ముఠా పట్టుబడింది. అసియాకు చెందిన ఓ వ్యక్తి గంటల లెక్కన జూదగాళ్లకు ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లు విచారణలో స్పష్టం అయ్యింది. అంతేకాదు...టీ, టిఫిన్లు ఆసియా వ్యక్తి సప్లై చేస్తాడని, అందుకు ప్రత్యేకంగా చార్జ్ ఉంటుందని గ్యాంబ్లర్స్ పోలీసులకు వివరించారు. దీంతో గ్యాంబ్లర్స్ తో ఆసియా వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో న్యూసెన్స్ కు తావులేకుండా, నిబంధనల ఉల్లంఘనలు జరక్కుండా అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఉంటుందని ఈ సందర్భంగా షార్జా పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించారు. ముఖ్యంగా బహిరంగ ప్రాంతాలు, భవన ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పచ్చిక బయళ్లలో చెత్తవేసినా, క్రాకర్స్ పేల్చి న్యూసెన్స్ చేసినా సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇక గ్యాంబ్లింగ్, వీధి వ్యాపారాన్ని, బిచ్చగాళ్లు, పైరసీ సీడీల అమ్మకాల వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుంటామని..ఇందుకోసమే నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను ముమ్మరం చేశామని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com