తిరుపతిలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ కు వినతి
- November 17, 2020
విజయవాడ:తిరుపతి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని భువనేశ్వర్ కు చెందిన హైటెక్ గ్రూప్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు విన్నవించారు. మంగళవారం రాజ్ భవన్ దర్బార్ హాలులో గౌరవ గవర్నర్ తో సమావేశం అయిన హైటెక్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ తిరుపతి ప్రాణీగ్రాహీ తిరుపతి పట్ణణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మెడికల్ కళాశాల గురించి వివరించారు. అత్యధునిక సౌకర్యాలతో ఆదునిక వసతులతో ఏర్పాటు చేసిన ఆసుప్రతి, మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు ముఖ్య అతిధిగా విచ్చేయాలని ఈ సందర్భంగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో రాజన్ కుమార్ అచార్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు