గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
- November 17, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని కావున తన అభిమానులను; స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని పిలుపునివ్వడం జరిగింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







