''లవ్ స్టోరి'' షూటింగ్ పూర్తి, త్వరలో విడుదల

- November 18, 2020 , by Maagulf
\'\'లవ్ స్టోరి\'\' షూటింగ్ పూర్తి, త్వరలో విడుదల

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''. ఈ రియలిస్టిక్ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ''లవ్ స్టోరి'' సినిమా తాజాగా పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో ''లవ్ స్టోరి'' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. 
 థియేటర్లు తెరుచుకుని, హాల్స్ దగ్గర ఆడియెన్స్ సందడి మొదలు కాగానే ''లవ్
స్టోరి'' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com