కువైట్ లోని ట్రావెల్స్, టూరిజం రంగాలకు కోవిడ్ దెబ్బ..భారీగా తగ్గిన ఆదాయం
- November 19, 2020
కువైట్ లోని ట్రావెల్స్, టూరిజం రంగాలపై కోవిడ్ 19 ప్రభావం భారీగానే కనపడుతోంది. లాక్ డౌన్ నాటి నుంచి మొదలు ఇప్పటివరకు బుకింగ్స్ భారీగా పడిపోయాయి. కోవిడ్ కు తోడు 34 దేశాల నుంచి ప్రవాసీయుల రాకపై ఆంక్షలు విధించటం కూడా ట్రావెల్స్, టూరిజంపై ప్రభావం చూపుతోంది. ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో ప్రవాసీయుల తాకిడి ఎక్కువగా ఉండే ఈజిప్ట్, పిలిప్పైన్స్, భారత్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్ ఏజెన్సీల్లో రిజర్వేషన్లు భారీగా తగ్గాయి. కరోనా ప్రభావం ఉన్న ఆ 34 దేశాల నుంచి ప్రవాసీయుల రాకపోకలపై ఆంక్షలను పాక్షికంగా సడలించటంతో ఫ్లైట్ బుకింగ్స్ కి రిజర్వేషన్లు పెరిగినా..కువైట్ ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రం రిజర్వేషన్లు పెరగటం లేదు. ప్రస్తుతం భారత్, పిలిప్పైన్స్ తో పాటు ఈస్ట్ ఏసియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కువైట్ ట్రావెల్ ఏజెన్సీలు క్వారంటైన్, హోటల్ బస, పీసీఆర్ టెస్టులతో కలిపి కువైట్ ట్రవెల్ ఏజెన్సీలు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఒక్కొక్కరికి KD550 వరకు చార్జ్ చేస్తున్నాయి. ఇక ఈజిప్ట్, లెబనాన్ వంటి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే వారికి KD600 ఛార్జ్ చేస్తున్నాయి. అయితే..ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సొంత దేశంలోని ట్రావెల్ ఏజెన్సీలో దాదాపుగా సగం ధరకే ప్యాకేజీ అందిస్తున్నాయి. అంటే KD300 నుంచి KD350 లోపు ధరతో రిజర్వేషన్ పూర్తి అవుతుంది. దీంతో ఆయా దేశాల ప్రయాణికులు ఎవరూ కువైట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా రిజర్వేషన్లు చేసుకునేందుకు మొగ్గు చూపటం లేదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు