60 ఏళ్ళ పైబడిన వలసదారులు ఫ్యామిలీ వీసాకు మారొచ్చు
- November 19, 2020
కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన వలసదారులు, దేశం విడిచి వెళ్ళకూడదనుకుంటే వారి ముందున్న ఒకే ఒక్క అవకాశం వారు ఫ్యామిలీ వీసాకు మారడమే. జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది గనుక, దేశంలో వుండాలనుకునే వలసదారులు, తమ వీసా స్టేటస్‌ని ఫ్యామిలీ వీసాగా మార్చుకోవాలి. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా మాట్లాడుతూ, జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నందున నిబంధనల పరిధిలోకి వచ్చే వలసదారులైన కార్మికులు తమ స్టేటస్‌ని మార్చుకోవాలని సూచించారు. ఆయా వలస కార్మికుల రెసిడెన్సీ పర్మిట్స్ రద్దవుతాయి. వాటిని పునరుద్ధరించే అవకాశం వుండదు. డిగ్రీలు వున్న వలసదారులకు ఈ నిబంధన వర్తించదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు