రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వస్తున్న 'ఇదే మా కథ'
- November 19, 2020
యువ హీరో సుమంత్ అశ్విన్ - శ్రీకాంత్ - భూమిక - తాన్యా హోప్ ప్రధాన పాత్రలతో రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం "ఇదే మా కథ". ఈ చిత్రానికి గురుపవన్ దర్శకత్వం వహించారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్రీకాంత్ - సుమంత్ అశ్విన్ - భూమిక - తన్యా హోప్ రైడర్స్ గెటప్ లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.కాగా 'ఇదే మా కథ' సినిమా కథంతా రోడ్ మార్గం నేపథ్యంలోనే సాగనుందని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ కి ముందే లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా.. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తగు జాగ్రత్తలతో చిత్రీకరణ చేశారు. ఇప్పటివరకు చేయని పాత్రల్లో సుమంత్ అశ్విన్ - శ్రీకాంత్ కనిపిస్తున్నారు. వైవిధ్యమైన కథతో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో సప్తగిరి - సమీర్ - సత్యం రాజేష్ - శ్రీజిత ఘోష్ - తివిక్రమ్ సాయి తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన