వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు
- February 19, 2026
కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు(immigration rules) చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా డాక్టర్లు, పరిశోధకులు, పైలట్లు,రక్షణ రంగ నిపుణులకు కెనడా ద్వారాలు త్వరగా తెరుచుకోనున్నాయి. బుధవారం ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు తక్షణ ఊపునిచ్చే నిపుణులనే లక్ష్యంగా చేసుకుని ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాజా నిబంధనల ప్రకారం.. హెల్త్‌కేర్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాల్లో ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ వీసాలు లభిస్తాయి. ఇందులో విదేశాల్లో శిక్షణ పొంది కెనడా(Canada)లో అనుభవం ఉన్న వైద్యులు, సీనియర్ మేనేజర్లు, విమాన మెకానిక్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ రీసెర్చర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే, వీటన్నింటికంటే ముఖ్యమైన మార్పు ఏంటంటే.. కెనడియన్ సాయుధ దళాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న విదేశీ సైనిక దరఖాస్తుదారులకు, మిలిటరీ డాక్టర్లకు, పైలట్లకు కూడా ఈ ప్రోగ్రామ్ కింద పెద్దపీట వేయబోతున్నారు.
కెనడా(canada) ప్రధాని మార్క్ కార్నీ తన రక్షణ వ్యూహంలో భాగంగా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి తన రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచాలని నిర్ణయించిన కెనడా, అందుకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఈ వలసల ద్వారా భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఒకవైపు దేశంలో గృహ నిర్మాణ రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు మొత్తం వలసదారుల సంఖ్యను తగ్గిస్తూనే, మరోవైపు అత్యంత అవసరమైన రంగాల్లో నిపుణులను మాత్రం వదులుకోకూడదని కెనడా ప్రభుత్వం ఈ బ్యాలెన్సింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ భాష తెలిసిన వారు, హెల్త్‌కేర్ వర్కర్లకు గతంలో ఉన్న ప్రాధాన్యత కూడా యధావిధిగా కొనసాగుతుంది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







