బీహార్ రగిల్చిన చిచ్చు..కాంగ్రెస్ లో అనిశ్చితి..
- November 19, 2020
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లో బిహార్ చిచ్చు చివరికి రాజీనామాల వైపు వ్యవహారం మళ్లింది. అయితే బిహార్ ఓటమిపై సమగ్రంగా విశ్లేషణ జరగాల్సిందేనని అన్ని పక్షాలూ పట్టుబడుతున్నాయి. బిహార్ ఘోర పరాభవానికి నైతికంగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి శక్తిసింగ్ గోలీ ఇప్పటికే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. ఈయనతో పాటు బిహార్ పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.
అయితే అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయానికి ఆయన వేచి చూస్తున్నట్లు ఆయన వర్గం అంటోంది. ఝా మాత్రం రాజీనామా విషయంలో ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. రాజీనామా విషయంపై ఝాను వివరణ కోరగా... ''ఆ విషయంపై నేను బహిరంగంగా స్పందించను. పార్టీ ఫోరంలోనే మాట్లాడతా. పార్టీ నేతలందరం కలిసి కూర్చుంటాం. ఓటమిని సమీక్షించుకుంటాం. హైకమాండ్ ఏది చెపితే దాన్ని శిరసావహిస్తాం.'' అని ఝా ప్రకటించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







