ఫేస్‌ మాస్కుల దొంగతనం: ఆరుగురికి జైలు శిక్ష, జరీమానా

- November 19, 2020 , by Maagulf
ఫేస్‌ మాస్కుల దొంగతనం: ఆరుగురికి జైలు శిక్ష, జరీమానా

దుబాయ్: ఆరుగురు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు దుబాయ్‌లోని ఓ గొడౌన్‌లోకి చొరబడి 150,000 దిర్హాముల విలువైన ఫేస్‌ మాస్కులను దొంగిలించినట్లుగా అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురు వ్యక్తులు పాకిస్తాన్‌ జాతీయులుగా తేలింది. వీరి వయసు 24 నుంచి 45 సంవత్సరాలుగా అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 18న అల్‌ రష్దియా పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదయ్యింది. జైలు శిక్ష పూర్తి చేసుకుని, 150,000 దిర్హాముల జరీమానా చెల్లించాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఒక్కో బాక్స్‌లో 1,000 ఫేస్‌ మాస్కులు గల మొత్తం 156 బాక్సుల్ని నిందితులు దొంగిలించినట్లు చైనాకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి నిందితులు ఉపయోగించిన వస్తువుల్ని ఓ కారులో కనుగొన్నారు. నిందితులు మాస్కులను బంగ్లాదేశీ వ్యక్తికి విక్రించినట్లు తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com