147,000 రెసిడెన్సీ వీసాలకు ముగిసిన గడువు
- November 19, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో తలెత్తిన అనేక సమస్యల కారణంగా వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కువైట్‌ని విడిచి ఆయా కారణాలతో వలసదారులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం 147,000 మందికి పైగా వలసదారుల రెసిడెన్సీ వీసాల గడువు తీరింది. కరోనా వైరస్‌కి ముందు దేశంలో వలసదారుల సంఖ్య 3.3 మిలియన్లు కాగా, ఇప్పుడు అది 2,650,000కి చేరింది. చెల్లుబాటయ్యే వీసాలు కలిగి వేరే దేశాల్లో వుండిపోయిన వలసదారుల సంఖ్య 365,000 కాగా, గడువు తీరిన వీసాల సంఖ్య 147,000గా వుంది. కాగా, 34 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కొనసాగుతోంది కరోనా నేపథ్యంలో. కాగా, రెసిడెన్సీ ఉల్లంఘనల విషయానికొస్తే 132,000 వలసదారులు ఈ లిస్ట్‌లో వున్నారు. మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్ ఇచ్చిన అవకాశాన్ని (డిసెంబర్ వరకు గడువు పొడిగింపు) 40,000 మందికి పైగా వినియోగించుకోనున్నారు. కాగా కార్మికులు అలాగే స్పాన్సర్స్ మధ్య వివాదాల పరిష్కారం కోసం ఓ మెకానిజంని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఏర్పాటు చేయనున్నాయి.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







