దుబాయ్: మిర్దిఫ్ సిటీ సెంటర్లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న రహదారులు
- November 20, 2020
దుబాయ్-షార్జా మధ్య రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఈ రెండు నగరాల మధ్య మిర్దిఫ్ సిటీ సెంటర్ లోని షేక్ మహమ్మద్ బిన్ జయాద్ రహదారిలో, అల్ రిబత్ ఇంటర్ సెక్షన్ దగ్గర రహదారులను విస్తరించటంతో అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది దుబాయ్ ఆర్టీఏ. ఈ అభివృద్ధి చేసిన రహదారులు నేటి నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. అల్ రిబత్, ట్రిపోలీ రహదారిలో మరో లేన్ ను నూతనంగా నిర్మించగా..ఇప్పటికే ఉన్న వంతెనను విస్తరించారు. దీంతో దుబాయ్, షార్జా మధ్య ట్రాఫిక్ ఫ్లో మరింత మెరుగవనుంది. ఇక ట్రిపోలీ స్ట్రీట్ కూడలి, షేక్ జయాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ రోడ్డు నుంచి ఎమిరాతి రహదారి వరకు రహదారిని విస్తరిస్తూ చేపట్టిన కొత్త రోడ్డు పనులను కూడా ఆర్టీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ కొత్త రోడ్డు 5.3 కిలోమీటర్ల మేర, రెండు దిశల్లో మూడు లేన్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్‌లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







