బిజెపికి సంపూర్ణ మద్దతు..పవన్ కళ్యాణ్
- November 20, 2020
హైదరాబాద్: హైదరాబాదులో నాదెండ్ల మనోహర్ నివాసంలో జనసేన, బిజెపి అగ్రనేతల సమావేశం ముగిసింది. జనసేనాని పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సమావేశమై జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై చర్చించారు. బిజెపి నేతలు జనసేన మద్దతు కోరగా, పవన్, నాదెండ్ల అందుకు సమ్మతించారు. భేటీ అనంతరం పవన్ స్పందిస్తూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ఏపిలో మాదిరే తెలంగాణలోనూ బిజెపితో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తగినంత సమయం లేకపోవడంతో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పొత్తు పెట్టుకోలేకపోయామని అన్నారు. బిజెపితో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్ రూపొందిస్తామని జనసేనాని వివరించారు. హైదరాబాదులో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే తమ కార్యకర్తలకు ఇష్టంలేకపోయినా జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బిజెపికి సహకరించాలని పవన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు