10 లక్షల డోసులు ఆర్డర్ ఇచ్చిన బహ్రెయిన్

- November 20, 2020 , by Maagulf
10 లక్షల డోసులు ఆర్డర్ ఇచ్చిన బహ్రెయిన్

మనామా:ఇంకా తుది అనుమతులు కూడా రాక ముందే కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ కు డిమాండ్ అమాంతంగా పెరుగుతోంది. జర్మనీకి చెందిన బయోటెక్ కంపెనీ బయోన్ టెక్ తో కలిసి తయారు చేసిన ఫైజర్...క్లినికల్ ట్రయల్స్ లో 90 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు ఆ కంపెనీదారులు ఇటీవలె ప్రకటించారు. అయితే..అప్పటికే కువైట్ ప్రభుత్వం పది లక్షల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. బహ్రెయిన్ కూడా పది లక్షల డోసులు కావాలని గత ఆగస్టులోనే ఫైజర్ కు ఆర్డర్ ఇచ్చింది. అయితే..మరో విశేషం ఏమిటంటే..బహ్రెయిన్ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు ఒప్పుకుంది. యూఏఈతో కలిసి సంయుక్తంగా సినోఫార్మ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతించింది. అయితే..వ్యాక్సిన్ రేసులో ఫైజర్ ముందు వరసలో ఉండటంతో ఆ కంపెనీకి మిలియన్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దేశ ప్రజల ఆరోగ్యభద్రతకు ఏది శ్రేయస్కరమో..కోవిడ్ 19 నియంత్రణ జాతీయ టాస్క్ ఫోర్స్ కూడా అదే నిర్ణయాన్ని అనుసరిస్తుందని బహ్రెయిన్ స్పష్టం చేసింది. ఏ వ్యాక్సిన్ కొనుగోలుపై టాస్క్ ఫోర్స్ సూచనలు కీలకమని తెలిపింది. అయితే..ఇతర కంపెనీలకు తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చినా... ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ ఉత్తమ ఫలితాలు సాధిస్తుందో ఆ వ్యాక్సిన్ ను కొనుగోలు చేస్తామని కూడా బహ్రెయిన్ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com