బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- February 15, 2026
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎగిరి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.
ప్రమాదంలో మృతిచెందిన యువకుల వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి సహా ప్రయాణికులు మద్యం సేవించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







