నాగశౌర్య,అనీష్ కృష్ణ, ఐరా క్రియేషన్స్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైన షర్లీ సేతియా
- November 21, 2020హైదరాబాద్:హ్యాండ్సమ్ యాక్టర్ నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ కాంబినేషన్లో ఐరా క్రియేషన్స్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది.
ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందిన సంచలన గాయని, నటి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగశౌర్య జోడీగా ఎంపికయ్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మస్కా'తో నటిగా మారిన షిర్లీ, త్వరలో 'నికమ్మా' చిత్రంతో బాలీవుడ్‌లోనూ పరిచయం అవుతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దర్శకునిగా అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా.
మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
హీరో హీరోయిన్లు: నాగశౌర్య, షర్లీ సేతియా
సాంకేతిక బృందం:
దర్శకుడు: అనీష్ కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సహ నిర్మాత: బుజ్జి
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్. గౌతమ్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు