అలా చేస్తే ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదముంది..ఇరాన్
- November 21, 2020
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం చివరి కాలంలో పాలనా యంత్రాంగాన్ని దాడులకు ప్రేరేపించొద్దని , జాగ్రత్తగా ఉండండంటూ తన మిత్రదేశాలను ఇరాన్ హెచ్చరించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని, అలా చేస్తు ట్రంప్ రేచ్చిపోయే ప్రమాదముందని మధ్యప్రాచ్యంలోని ఇరాన్ మిత్రదేశాలకు సూచించింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలపై ట్రంప్ అనూహ్య ప్రవర్తన, అధికారాల బదలాయింపుపై నెలకొన్న అనిశ్చితిపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని ఇరాన్ మిత్ర దేశాలు సంయుక్తంగా స్వాగతించాయి. ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఏడాది మొదట్లో బాగ్దాద్ విమానాశ్రయంలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానిని అమెరికా సైన్యం వైమానిక దాడి జరిపి హతమార్చిన తర్వాత మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాక్‌లో అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకొని, డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది.
ట్రంప్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్న వేళ తన పదవి చివరి కాలంలో ఏమైనా చేయగలరనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత గురువారం ఇరాన్ సుప్రీం నాయకుడి సలహాదారు అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలో ఖపూర్తిస్థాయి యుద్ధాన్నిగ ప్రారంభించవచ్చని హెచ్చరించారు. ఖమేం యుద్ధాన్ని స్వాగతించడం లేదని అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆధ్వర్యంలో రక్షణ మంత్రిగా మారడానికి ముందు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌లో పనిచేసిన హుస్సేన్ డెహగాన్ అన్నారు. వాస్తవానికి రెండు జనవరి మధ్య నాటికి మిషన్‌ను పూర్తి చేసుకొని తిరిగి రావాలని అమెరికా సైన్యానికి అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. అయితే ఇటీవల ట్రంప్ ఇరాన్ ప్రధాన అణుస్థావరంపై దాడి చేసేందుకు ఉన్న మార్గాల్ని సూచించాలని అధికారులను కోరినట్టు ప్రచారం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?