కువైట్:ఇండియాతో సహా 34 దేశాలపై నిషేధం కొనసాగింపు..ఎన్నికల తర్వాతే నిర్ణయం
- November 22, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావిత దేశాలుగా పరిగణిస్తున్న 34 దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై కువైట్ ప్రభుత్వం నిషేధం యధావిధిగా కొనసాగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో భారత్ తో సహా నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కువైట్ వెళ్లాలనుకునే ప్రవాసీయులు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి 34 దేశాలపై ఆంక్షలు పాక్షికంగా సడలించింది..పకడ్బందీ క్వారంటైన్ నిబంధనలతో డొమస్టిక్ వర్కర్లకు అనుమతించాలని ఇటీవలె కువైట్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే..వచ్చే నెలలో కువైట్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంక్షల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ అధికారవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఎన్నికలు ముగిసన తర్వాతే ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పిలిప్పైన్స్ తో పాటు మిగిలిన బ్యాన్డ్ కంట్రీస్ నుంచి ప్రవాసీయులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు