బహ్రెయిన్:నోరూరించే హల్వాలో మత్తెక్కించే డ్రగ్స్..ఇండియన్ అరెస్ట్
- November 22, 2020
మనామా:నోరూరించే స్వీట్ బాక్స్. తాజా స్వీట్ వాసనతో ఘుమఘులాడిపోతూ హల్వా బాక్స్. బహ్రెయిన్ లో ఉంటున్న తన స్నేహితుడి కోసం తీసుకెళ్తున్నాడో యువకుడు. అయితే..ఎయిర్ పోర్టులో తనిఖీ చేపట్టిన అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. హల్వా బాక్స్ ను తెరిచి క్షణ్ణంగా పరిశీలిస్తే..స్వీట్ చాటున డ్రగ్స్ ఉన్న విషయం బయటపడింది. దీంతో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇదంతా కేరళాలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. పట్టుబడిన వ్యక్తి పేరు సుదీష్. కాసర్ గడ్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల సుదీష్ మాత్రం హల్వాలో డ్రగ్స్ మిక్స్ చేసిన విషయం తనకు తెలియదని చెబుతున్నాడు. బహ్రెయిన్ లో ఉన్న తన స్నేహితుడికి ఇవ్వాల్సిందిగా అతని బంధువులు స్వీట్ బాక్సును ఇచ్చారని..తనకు అంతవరకు మాత్రమే తెలుసని అంటున్నాడు. తాను అమాయకుడనని, డ్రగ్స్ విషయంలో తనకు ఏ పాపం తెలియదని వాపోయాడు. ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు నిందితుడ్ని విచారించిన తర్వాత కేసును స్థానిక పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు