గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల ద్వారా నీరు సరఫరా-మోదీ
- November 22, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు స్వయం సమృద్ధ గ్రామాలు, స్వయం సమృద్ధ భారత దేశం కోసం జరుగుతున్న కృషికి దోహదపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా వల్ల గ్రామీణ మహిళల జీవితాలు, పేదల ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని మోదీ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘జన జీవన్ మిషన్’ పథకం క్రింద గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోందని, దీనివల్ల మన అమ్మలు, అక్కచెల్లెళ్ళ జీవితాలు సుఖవంతమవుతున్నాయని చెప్పారు.
దీని ప్రధాన ప్రయోజనం పేదల ఆరోగ్యం మెరుగుపడటమేనన్నారు. మలినాలు నిండిన నీటి వల్ల అనేక రోగాలు వస్తాయని, సురక్షిత నీటి సరఫరా కారణంగా ఈ రోగాలు తగ్గుతున్నాయని మోదీ చెప్పారు. గిరిజన గ్రామాల ప్రజల జీవన శైలికి అనుగుణంగా ఇళ్లను నిర్మించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను గ్రామస్తులకే కల్పిస్తే, గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









