తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు..
- November 23, 2020
అన్‌లాక్ 5లో భాగంగా దేశంలో సినిమా థియేటర్లను తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకోవడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు జీవో విడుదల చేయలేదు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తక్షణమే తెరుచుకోవచ్చని జీవోలో పేర్కొంది.
కేంద్ర హోం శాఖ సూచించినట్టుగా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ప్రాంతాల్లో మాత్రమే థియేటర్లు, మల్టీ్ప్లెక్సులను తెరవాలని పేర్కొంది.
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఇవే..
1) ప్రేక్షకులు, థియేటర్ స్టాఫ్, వ్యాపారులు.. ఇలా అందరూ కచ్చితంగా అన్ని వేళలా మాస్క్‌లు ధరించాలి.
2) థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద, కామన్ ఏరియాస్‌లో కచ్చితంగా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
3) భౌతిక దూరం, ప్రేక్షకులు గుమిగూడకుండా చూడటం తప్పనిసరి.
4) షో ముగిసిన ప్రతి సారి థియేటర్ పరిసరాలు, ముఖ్యంగా కామన్ ఏరియాస్‌లో శానిటైజేషన్ తప్పనిసరి.
5) ఎయిర్ కండిషన్‌తో పనిచేసే థియేటర్లలో ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. అలాగే సాపేక్ష ఆర్ద్రత (రిలేటివ్ హ్యుమిడిటీ) 40 నుంచి 70 శాతం మధ్య ఉండాలి. వీలైనంత వరకు లోపల గాలి బయటకు.. బయట నుంచి తాజా గాలి లోపలికి వెళ్లే ఏర్పాటు ఉండాలి.
6) మల్టీప్లెక్సులు, రెండు మూడు థియేటర్లు కలిసి ఉన్న చోట అన్ని షోలకు ఒకేసారి ఇంటెర్వల్ ఉండకూడదు. కాబట్టి, షోలన్నీ ఒకేసారి ప్రారంభం కాకూడదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు