బాప్ రే.. ఐపీఎల్ ఆదాయం రూ.4 వేల కోట్లట!

- November 23, 2020 , by Maagulf
బాప్ రే.. ఐపీఎల్ ఆదాయం రూ.4 వేల కోట్లట!

ఐపీఎల్​ ఆటతో మజా పంచడమే కాదు.. బీసీసీఐ జేబు కూడా అట్లాగే నింపుతోంది. ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్ ద్వారా బీసీసీఐ కి రూ.4 వేల కోట్ల ఆదాయం  వచ్చిందట. ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏడాది ఐపీఎల్ ద్వారా బీసీసీఐ  బోర్డుకు వేల కోట్ల ఈఆదాయం వస్తోంది. అందుకే ఈసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా..  సరే ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ వెనక్కి తగ్గలేదు. మనదేశంలో క్రికెట్ ఆడే పరిస్థితి లేకపోయినా,  స్టేడియాలకు జనం వచ్చేందుకు అవకాశం లేకపోయినా దుబాయ్ లో మ్యాచ్ లు  నిర్వహించి వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.

 ఈ ఏడాది కోవిడ్ కారణంగా క టీ ట్వంటీ వరల్డ్ కప్ వాయిదాపడినా.. బీసీసీఐ  మాత్రం ఐపీ ఎల్ ను వాయిదా వేయలేదు. మనదేశంలో ఆడే పరిస్థితి లేకున్నా.. దుబాయ్ కి వెళ్లి మరి.. ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచి మ్యాచ్ లను కొనసాగించారు. ఇప్పుడు బీసీఐ పడ్డ శ్రమకి తగిన ఫలితమే లభించినట్లయింది. ఐపీఎల్ నిర్వహణ వల్ల బోర్డు కు రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఐపీఎల్ సీజన్​ వచ్చేసిందంటే  ప్రేక్షకులకు ఫుల్​ ఎంటర్​టెయిన్మెంట్. ఐపీఎల్​ సీజన్​లో సినిమాల విడుదలను కూడా ఆపేస్తారంటే దీనికి ఎంత క్రేజ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఐపీఎల్​ ద్వారా కొత్త ఆటగాళ్లు పరిచయం అవుతారు. ఆటలో రాణించిన వారు స్టార్లుగా కూడా ఎదుగుతుంటారు.

ఐపీఎల్​లో  ప్రదర్శన ఆధారంగానే వివిధ దేశాలు తమ జట్లను ఎంపికచేసుకుంటాయి. ఆటగాళ్లకు ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ప్రతి ఐపీఎల్​ సీజన్​లో వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కరోనా ఎఫెక్ట్​తో ఐపీఎల్​2020 లో కొంచెం హడావుడి తక్కువగా ఉంది. చీర్​గర్ల్స్​, స్టేడియంలో అభిమానులు లేకపోవడంతో ఈ సారి కొంత సందడి తక్కువైంది. అయినప్పటికీ టీవీల ముందు మాత్రం ప్రేక్షకులు ఎప్పటిలాగే ఎంజాయ్​ చేశారు. గత సీజన్​కంటే 25 శాతం అధికంగా టీవీ వీక్షకులు పెరిగారని బీసీసీఐ పేర్కొన్నది.  ఈ సీజన్​లో ఐపీఎల్​ ద్వారా సుమారు రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చినట్టు బీసీసీఐ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com