జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు
- November 24, 2020
హైదరాబాద్:టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తపేట ,కర్మానఘట్ రోడ్ షో లో టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా టీఆరెస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1 న జరగనున్న హైదరాబాద్ స్ధానిక మునిసిపల్ ఎన్నికలో భాగంగా టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల మరియు టీఆరెస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి పర్యవేక్షణ మరియు సూచనల మేరకు వివిధ దేశాల నుండి టీఆరెస్ ఎన్నారై ప్రతినిధులు సోషల్ మీడియా లో మరియు హైదరాబాద్ కి ప్రత్యక్షంగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానిక తెరాస కార్పొరేటర్ల గెలుపు కొసం తమ వంతు కృషి చేస్తు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు టీఆరెస్ అభ్యర్థులకి ఓటు వేసి ప్రత్యర్ధులకు మంచి బుద్ధి చెప్తారు అని ధీమా వ్యక్తం చేసారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







