వారికి కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదు..
- November 24, 2020
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి శరీరంలో కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక కణాలు సరిపడా తయారై ఉంటాయి. కాబట్టి వీరికి పదే పదే వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదని అంటున్నారు అధ్యయనకారులు. పలువురు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు 19 నుంచి 81 ఏళ్ల మధ్య వయసులో ఉన్న185 కోవిడ్ బాధితుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించారు. ఆ అధ్యయనంలో వారి శరీరాల్లో వైరస్‌తో సమర్ధంగా పోరాడే బీ, టీ లింపోసైట్ కణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు కనిపించింది. ఇలా పెరిగిన కణాలు ఏళ్ల తరబడి శరీరాల్లో ఉండి, శరీరాన్ని రీ ఇన్‌ఫెక్షన్‌కు గురి కాకుండా కాపాడతాయి. అలాగే వీరి శరీరాల్లో కోవిడ్ వైరస్‌కు సంహకరించే క్రమంలో తయారయ్యే యాంటీబాడీలు కూడా ఆలస్యంగా అంతరిస్తున్న్లట్లు వారు గమనించారు. కోలుకున్న వ్యక్తుల్లోని రోగనిరోధక వ్యవస్థ వైరస్ ఎప్పుడు దాడి చేసినా పోరాడే శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. ఫలితంగా వైరస్‌తో కూడిన వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తరహా రోగ నిరోధక వ్యవస్థ ఎన్నేళ్లు ఉంటుందనేది కచ్చితంగా చెప్పడం కష్టం అని అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష