స్మార్ట్‌ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్‌ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌

- November 24, 2020 , by Maagulf
స్మార్ట్‌ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్‌ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌, ప్రభుత్వ రెవెన్యూని స్మార్ట్‌ ఫోన్ల ద్వారా వసూలు చేసే విషయమై 22/2020 నెంబర్‌ సర్క్యులర్‌ని జారీ చేయడం జరిగింది. మొబైల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ని బ్యాంకు సర్వీసుల అప్లికేషన్లు అలాగే ఇ-వ్యాలెట్లను ఉపయోగించి రెవెన్యూ వసూళ్ళు చేయాల్సిందిగా అన్ని మిఇస్ట్రీస్‌, గవర్నమెంట్‌ యూనిట్స్‌కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ (సిబిఓ) మొబైల్‌ పేమెంట్‌ క్లియరింగ్‌ మరియు సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ని ప్రకటించిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సర్క్యులర్‌ జారీ అయ్యింది. క్యుఆర్‌ కోడ్‌ ఆధారిత పేమెంట్లు, మొబైల్‌ పేమెంట్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు జరగనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com