దుబాయ్‌, షార్జాల్లో ఎటు చూసినా నీరే

- February 18, 2016 , by Maagulf
దుబాయ్‌, షార్జాల్లో ఎటు చూసినా నీరే

భారీ వర్షాలు దుబాయ్‌, షార్జా సహా నార్తరన్‌ ఎమిరేట్స్‌లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు పెద్దమొత్తంలో నిలిచిపోయిన నీటితో ఇబ్బందులు పడుతున్నారు. బుర్‌దుబాయ్‌, డీరా, అల్‌ నహదా మరియు షార్జాలోని ఇతర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడాల్సి వస్తుంది. దుబాయ్‌లో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లపై వాహనాలు వేగంగా వెళ్ళే పరిస్థితి లేదని వాహనదారులు చెబుతున్నారు. ఫుజారియా, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం ఈ రోజు కూడా నమోదు కానుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్నాయి. దాంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆకాశం పూర్తిస్థాయిలో మేఘావృతమై కనిపిస్తుంది. అక్కడక్కడా వడగళ్ళు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు కూడా యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ అండ్‌ సెస్మాలజీ హెచ్చరికలు జారీ చేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com