షార్జాలో ట్రాఫిక్ ఇబ్బందులు
- February 18, 2016
దుబాయ్ నుంచి షార్జాకి వెళ్ళే రహదార్లపై ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడమే దీనికి కారణం. పోలీసు అధికారులు రోడ్లపై ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. అల్ వహ్దా ప్రాంతం వర్షాలకు భారీగా ఎఫెక్ట్ అయ్యింది. ఇక్కడ ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా ఉంది. పోలీసులు, ముననిసిపల్ అథారిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళేవారు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వాహనాలు ఉన్నవారు కూడా వాటిని పక్కన పడేసి నడుచుకుంటూ వెళుతున్నారంటే రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనుంచి కదల్లేని పరిస్థితి ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







