అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి
- November 25, 2020
గురుగావ్:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూశారు. కరోనాతో దాదాపు నెలన్నర రోజుల పాటు పోరాడుతూ మృతి చెందారు. గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. 71 ఏళ్ల వయస్సున్న అహ్మద్ పటేల్‌కు గత కొద్ది రోజులుగా శరీరంలోని పలు అవయవాలు సరిగ్గా పని చేయకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఈ నెల 15 నుంచీ ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విచారకరమైన రోజని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మూలస్థంభమని... పార్టీతో కలిసి చాలా కష్ట సమయాల్లోనూ నిలబడ్డారని గుర్తు చేశారు. ఆయనను కోల్పోవడం బాధాకరమన్నారు. ఫైజల్, ముంతాజ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







