రెసిడెన్సీ పర్మిషన్ ఉల్లంఘనులు డిసెంబర్ 31 స్టేటస్ చెక్ చేసుకోవాలన్న కువైట్
- November 25, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ప్రవాసీయులు, విజిట్ విసాదారుల రెసిడెన్సీ పర్మిషన్ కు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ అనుమతుల గడువు ముగిసిన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికల్లా తమ స్టేటస్ ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. గడువు ముగిసన వారు నివాస అనుమతుల ఉల్లంఘన కింద జనవరి 1, లేదా అంతకుముందే ఫైన్ చెల్లించి తగిన అనుమతులు పొందాలని తెలిపింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలని అనుకుంటే...తప్పనిసరిగా ఫైన్ చెల్లించి ప్రయాణానికి సంబంధించి క్లియరెన్స్ పత్రాలను పొందాలని వివరించింది. నిర్ణీత గడువులోగా జరిమానాలు చెల్లించిన వారు మాత్రమే భవిష్యత్తులో తిరిగి కువైట్ చేరుకునేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలో ఫైన్ చెల్లించకుంటే వారికి భవిష్యత్తులో కువైట్ తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని కూడా హెచ్చరించింది. ఇక ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో విజిట్ వీసాదారుల వీసా ఆటోమెటిగ్గా రెన్యూవల్ అవుతుందని, అయితే..తాత్కాలిక రెసిడెన్సీ అనుమతులను మాత్రం అందుకు అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ నెలాఖరు నాటికి దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







